Flipkart Monumental Sale : ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంట‌ల్‌ సేల్‌ ..! 15 h ago

featured-image

ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ నూతన సంవత్సరంలో మాన్యుమెంట‌ల్‌ సేల్‌ను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేల్ జనవరి 14 నుండి ప్రారంభమవుతుంది. కానీ ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్ల కోసం ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 13న అందుబాటులోకి రానుంది. అయితే, ఈ సేల్ ఎంతవరకు కొనసాగుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.ఈ కార్డులపై ఆఫర్లను ఇంకా తెలుపలేదు.

ఈ సేల్‌కు సంబంధించిన ప్రత్యేక డీల్స్ కోసం మైక్రోసైట్ ఇప్పటికే సిద్ధం చేయబడింది. ల్యాప్‌టాప్, టీవీ, ఇయ‌ర్‌బ‌డ్స్‌, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్లపై పెద్దఎత్తున డీల్స్ ఉంటాయని ఫ్లిప్ కార్డ్‌ పేర్కొన్నది. శాంసంగ్ గెలాక్సీ ఏఐ, గెలాక్సీ ఎస్23, ఎస్24 సిరీస్, మరియు జెడ్ ఫోల్డ్, జెడ్ ఫ్లిప్ సిరీస్‌పై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కానీ, ఈ సేల్లో ఎంత డిస్కౌంట్ ఉంటుందో మాత్రం వెల్లడించలేదు. ఐ ఫోన్లపై ప్రత్యేకమైన రాయితీ కల్పించడంపై ప్రయోగాలు జ‌రుగుతున్నాయి.

అయితే, అమెజాన్ కూడా జనవరి 13 నుండి గ్రేట్ రిపబ్లిక్ సేల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. సాధారణ ఉపయోగదారులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ మెంబర్లకు అర్ధరాత్రి నుంచే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుందని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డులతో చేసిన కొనుగోళ్ళపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుంది.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD